- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా ఊపిరి పోశారు’
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. దీక్ష చేపట్టిన పల్లా శ్రీనివాస్‌ను దీక్ష విరమింపజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… గత ఆరు రోజులుగా శ్రీనివాస్ దీక్ష చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ 5 లక్షల మందికి ఉపాధి కల్పించిందని తెలిపారు. అంతేగాకుండా విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా ఊపిరి పోశారని వెల్లడించారు. ఎందరో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. దీక్ష చేపట్టిన పల్లా శ్రీనివాస్‌ను దీక్ష విరమింపజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… గత ఆరు రోజులుగా శ్రీనివాస్ దీక్ష చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ 5 లక్షల మందికి ఉపాధి కల్పించిందని తెలిపారు. అంతేగాకుండా విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా ఊపిరి పోశారని వెల్లడించారు. ఎందరో ప్రాణత్యాగాలతో విశాఖ స్టీల్‌ప్లాంట్ వచ్చిందని, స్టీల్‌ప్లాంట్ లేకపోతే విశాఖ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరామర్శలో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస రావు, చినరాజప్ప, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.
Next Story






