- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెనక్కి తగ్గబోమంటున్న చంద్రబాబు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటిదాకా మూడు రాజధానుల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగగా, ప్రస్తుతం అదికాస్త ఫొన్ ట్యాపింగ్ వైపు మళ్లింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుల ఫొన్లు ట్యాప్ అవుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఫొన్ ట్యాపింగ్‌పై తాను చేసిన ఆరోపణలపై వెనక్కి తగ్గరాదని, దీనిపై మరింత పోరాటం చేసేందుకు టీడీపీ […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటిదాకా మూడు రాజధానుల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగగా, ప్రస్తుతం అదికాస్త ఫొన్ ట్యాపింగ్ వైపు మళ్లింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుల ఫొన్లు ట్యాప్ అవుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఫొన్ ట్యాపింగ్‌పై తాను చేసిన ఆరోపణలపై వెనక్కి తగ్గరాదని, దీనిపై మరింత పోరాటం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫొన్ ట్యాపింగ్ చేయడం వైసీపీకి ఎప్పట్నించో ఉన్న అలవాటని విమర్శించారు. గతంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఫొన్ కూడా వైసీపీనే ట్యాప్ చేసిందని ఆరోపించారు.
ఇదిలాఉండగా, రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్ కు పాల్పడుతున్న ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలంటూ తాను ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తే, ఏపీ డీజీపీ స్పందించడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. సాక్ష్యాలు కావాలంటూ డీజీపీ తనకు లేఖ రాయడం ఎంటనీ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవాళ సాక్ష్యాలు కోరుతున్న డీజీపీ గతంలో రాసిన లేఖలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పగలరా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రస్తుతం డాక్టర్ల ఫొన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని, రోగులతో ఫొన్‌లో మాట్లాడాలన్నా డాక్టర్లు హడలిపోయే పరిస్థితి నెలకొందని చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.






