- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
65 సార్లు తప్పుపట్టినా దులిపేసుకున్నారు: చంద్రబాబు
<p>దిశ ఏపీ బ్యూరో: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ మాధ్యమంగా ఆయనను గుర్తు చేసుకుంటూ వైఎస్సార్సీపీకి రాజకీపాఠాలు చెప్పారు. ట్విట్‌లో కేంద్రమంత్రి గా, లోక్ సభ స్పీకర్ గా, భారత రాష్ట్రపతిగా ఎన్నో పదవులు చేపట్టి, విశేషంగా సేవలందించిన తెలుగువెలుగు నీలం సంజీవరెడ్డి అంటూ కొనియాడారు. నీలం సంజీవరెడ్డి తన జీవితంలో పాటించిన విలువల గురించి నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. నీలం […]</p>

దిశ ఏపీ బ్యూరో: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ మాధ్యమంగా ఆయనను గుర్తు చేసుకుంటూ వైఎస్సార్సీపీకి రాజకీపాఠాలు చెప్పారు. ట్విట్‌లో కేంద్రమంత్రి గా, లోక్ సభ స్పీకర్ గా, భారత రాష్ట్రపతిగా ఎన్నో పదవులు చేపట్టి, విశేషంగా సేవలందించిన తెలుగువెలుగు నీలం సంజీవరెడ్డి అంటూ కొనియాడారు. నీలం సంజీవరెడ్డి తన జీవితంలో పాటించిన విలువల గురించి నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించి పదవినే వదిలేశారని ఆయన గుర్తు చేశారు. తాను లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నిక కాగానే నిష్పాక్షికంగా ఉండాలని భావించి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి విలువలకు పట్టం కట్టారని చంద్రబాబు ఆయనను గొప్పదనాన్ని కొనియాడారు. అందువల్లే ఆయన భారత రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చంద్రబాబు తెలిపారు.
అయితే, ప్రస్తుతం పదవుల్లో ఉన్నవారు కోర్టులు ఒక్కసారి కాదు, 65 సార్లు తప్పుబట్టినా దులిపేసుకుంటున్నారని వైఎస్సార్సీపీని ఎద్దేవా చేశారు. కోర్టు వ్యాఖ్యలనే కాదు, కోర్టు తీర్పులను కూడా లక్ష్యపెట్టని పెడ ధోరణులు కూడా చూస్తున్నామన్న ఆయన, పైగా కోర్టులకే దురుద్దేశాలు ఆపాదించే హీన స్థితికి దిగజారడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, నీలం సంజీవరెడ్డి వంటి మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.






