Andhra News :కేసులతో వేధిస్తారా..  ఏపీ పోలీసులపై చంద్రబాబు ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-06-20 03:15:30  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra babu Naidu) లేఖ రాశారు. నెల్లూరు జిల్లాలో దాడికి గురైన ఎస్సీలపైనే అక్రమకేసులు పెట్టారంటూ లేఖలో ఆరోపించారు. పైడేరు కాల్వాలో వైసీపీ నేతల మట్టిమాఫియాను ప్రశ్నించినందుకు మల్లికార్జునపై నలుగురు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. మల్లికార్జునపై దాడికి పాల్పడిన వారిని పట్టుకోవాల్సిన పోలీసులు అతడిపైనే తప్పుడు కేసులు పెట్టారని ఇది అన్యాయమన్నారు. ఓ ఎస్సీ యువకుడిని వేధిచేందుకు పోలీసులు, [&hellip;]</p>

Chandrababu naidu
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra babu Naidu) లేఖ రాశారు. నెల్లూరు జిల్లాలో దాడికి గురైన ఎస్సీలపైనే అక్రమకేసులు పెట్టారంటూ లేఖలో ఆరోపించారు. పైడేరు కాల్వాలో వైసీపీ నేతల మట్టిమాఫియాను ప్రశ్నించినందుకు మల్లికార్జునపై నలుగురు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. మల్లికార్జునపై దాడికి పాల్పడిన వారిని పట్టుకోవాల్సిన పోలీసులు అతడిపైనే తప్పుడు కేసులు పెట్టారని ఇది అన్యాయమన్నారు.

ఓ ఎస్సీ యువకుడిని వేధిచేందుకు పోలీసులు, వైసీపీ నేతలతో చేతులు కలపడం దురదృష్టకరమన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ లేని విధంగా పోలీసుల చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈ దాడి ఘటనలో పోలీసులు వాస్తవాలు తెలుసుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితుడు మల్లికార్జునను తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన కొడవలూరు పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జునపై దాడికి సంబంధించిన ఓ వీడియోను లేఖకు జతచేశారు.

Next Story