- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భాగ్యనగర వాసులకు సాయం చేయండి : బాబు
<p>దిశ, వెబ్‌డెస్క్ : గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతోన్న విషయం తెలిసిందే. వాగులు తెగిపోవడం, మూసీ నది పొంగిపొర్లడంతో తీవ్ర ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా సంభవించింది. ఇన్నిరోజులు కరోనాతో వణికిపోయిన నగరవాసులను ప్రస్తుతం వర్షాలు నాలుగు గోడల మధ్యకు నెట్టివేశాయి. తాజాగా హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. నగరవాసులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని తమ పార్టీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతోన్న విషయం తెలిసిందే. వాగులు తెగిపోవడం, మూసీ నది పొంగిపొర్లడంతో తీవ్ర ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా సంభవించింది. ఇన్నిరోజులు కరోనాతో వణికిపోయిన నగరవాసులను ప్రస్తుతం వర్షాలు నాలుగు గోడల మధ్యకు నెట్టివేశాయి.
తాజాగా హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. నగరవాసులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ.. తమ కుటుంబాన్ని సైతం జాగ్రత్తగా చూసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Next Story






