శ్రీధర్ రావుకు లొంగని చైతన్య.. రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు

by  |
Sandhya Convention MD Sridhar Rao
X

దిశ, వెబ్‌డెస్క్: భూముల కొనుగోలు, భవన నిర్మాణాల విషయంలో అనేక మందిని మోసం చేసిన కేసులో ఇప్పటికే అరెస్టైన సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌కు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించించి. అనంతరం ఈ కేసుపై విచారణ జరుపుతోన్న అధికారులు కీలక విషయాలు వెలుగులోకి తెస్తుండగా, ఒక్కొక్కరుగా శ్రీధర్ రావు బాధితులు బయటకొస్తున్నారు. ఇప్పటివరకు పలు పోలీస్ స్టేషన్లలో 16కు పైగా కేసులు నమోదు అయ్యాయి. నార్సింగి, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో శ్రీధర్ రావుపై కేసు నమోదయ్యాయి.

తాజాగా.. రాయదుర్గం భవన నిర్మాణ వ్యవహారానికి సంబంధించి శ్రీధర్ రావుపై చైతన్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రాయదుర్గంలో చైతన్య రెండు ప్లాట్లు కొనుగోలు చేశాడు. పూర్తి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అనంతరం రాయదుర్గం ఏరియాలో ప్లాట్ల రేట్లు బీభత్సంగా పెరిగిపోయాయి. దీంతో చైతన్య ప్లాట్లపై కన్నెసిన శ్రీధర్ రావు, చైతన్యను బెదిరింపులకు గురిచేశాడు. రిజిస్ట్రేషనల్ క్యాన్సిల్ చేసి తన పేరుమీద చేయించాలని చైతన్యపై ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో శ్రీధర్ రావు బెదిరింపులకు లొంగని చైతన్య రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Next Story