- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో కేంద్రబృందం పర్యటన
<p>దిశ, న్యూస్‌బ్యూరో : కేంద్ర బృందం శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. పేట్లబుర్జు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని సందర్శించి.. లాక్‌డౌన్ పరిస్థితుల్లో వైద్య సేవలకు వస్తున్న పేషెంట్ల వివరాలను, అందిస్తోన్న సేవలను, అందుబాటులో ఉన్న వసతుల గురించి వాకబు చేశారు. అనంతరం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి, జోనల్ కమిషనర్ ప్రావిణ్య, డిప్యూటి కమిషనర్లతో లాక్‌డౌన్, కంటైన్‌మెంట్ జోన్లలో తీసుకుంటున్న చర్యల గురించి సమీక్షించారు. సోమాజిగూడ ఎర్రమంజిల్‌లో నిర్మాణంలో ఉన్న భవన సమీపంలో ఏర్పాటుచేసిన […]</p>

దిశ, న్యూస్‌బ్యూరో : కేంద్ర బృందం శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. పేట్లబుర్జు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని సందర్శించి.. లాక్‌డౌన్ పరిస్థితుల్లో వైద్య సేవలకు వస్తున్న పేషెంట్ల వివరాలను, అందిస్తోన్న సేవలను, అందుబాటులో ఉన్న వసతుల గురించి వాకబు చేశారు. అనంతరం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి, జోనల్ కమిషనర్ ప్రావిణ్య, డిప్యూటి కమిషనర్లతో లాక్‌డౌన్, కంటైన్‌మెంట్ జోన్లలో తీసుకుంటున్న చర్యల గురించి సమీక్షించారు. సోమాజిగూడ ఎర్రమంజిల్‌లో నిర్మాణంలో ఉన్న భవన సమీపంలో ఏర్పాటుచేసిన వలస కార్మికుల వసతిని తనిఖీ చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు నిలిచినప్పటికీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వలస కార్మికులకు నిర్మాణ సంస్థ కల్పించిన భోజన వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఎల్బీనగర్ జోన్‌లోని ఉప్పల్‌లో నెలకొల్పిన డిఎన్‌ఏ, ఫింగర్‌ప్రింట్ అండ్ డయోగ్నస్టిక్స్ కేంద్రాన్ని కేంద్ర బృందం సందర్శించింది. ఈ సంస్థలో ఉన్న వసతులు, నిర్వహిస్తున్న పరీక్షల తీరును సి.డి.ఎఫ్.డి డైరెక్టర్ దేబశీష్ మిత్రతో చర్చించారు.
Tags: corona, GHMC, Lockdown, Centram Team, Hospital






