నిర్లక్ష్యం వలదు..  రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ

by  |
నిర్లక్ష్యం వలదు..  రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ
X

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షలు క్రమంగా ఎత్తేస్తుండటంతో మార్కెట్లు, ఇతర కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పెద్దఎత్తున కనిపిస్తున్నారని పేర్కొంటూ అన్‌లాక్ చేసిన తర్వాత ఐదు సూత్రాల అమలు అత్యావశ్యకమని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. కరోనా కేసులు తగ్గినప్పుడు లాక్‌డౌన్ ఎత్తేయాల్సిన అవసరముందని, కానీ, ఆంక్షలు విధించడం, సడలించడం వంటి నిర్ణయాలు పూర్తిగా క్షేత్రస్థాయి పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించి, సరైన అంచనాలతో తీసుకోవాలని కేంద్ర హోం వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఓ లేఖలో సూచించారు. అన్‌లాక్‌లోనూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఐదు సూత్రాలు కొవిడ్ నిబంధనలు, టెస్టు, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్‌లను తప్పకుండా అమలు చేయాలని తెలిపారు. మాస్కు ధరించడం, చేతులు తరుచూ శుభ్రపరుచుకోవడం, భౌతిక దూరం, క్లోజ్‌డ్ ప్లేసుల్లో సరిపడా వెంటిలేషన్‌లు కొవిడ్ అప్రప్రియేట్ బిహేవియర్ కింద ఉన్నాయని, వీటిని తప్పకుండా అమలు చేయాలని వివరించారు.

కరోనా మహమ్మారి ఎప్పుడు మళ్లీ తిరగబెట్టేది సులువుగా అంచనా వేయలేమని, కాబట్టి, లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తేసినా కచ్చితమైన మానిటరింగ్ అవసరమని నొక్కిచెప్పారు. అందుకే కరోనా టెస్టు రేటింగ్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. జిల్లా స్థాయిల్లో కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, కరోనా కేసులు పెరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మిని లాక్‌డౌన్‌లు విధించాలని పేర్కొన్నారు. వైరస్ శృంఖలాలను తెంచడానికి టీకా పంపిణీ కీలకాస్త్రమని, రాష్ట్రాలు వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని తెలిపారు

Next Story

Most Viewed