‘కొవిషీల్డ్’ డోసులపై కేంద్రం కీలక నిర్ణయం

by  |
‘కొవిషీల్డ్’ డోసులపై కేంద్రం కీలక నిర్ణయం
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి, రెండో డోసుల మధ్య వ్యవధిని పెంచాలన్న నిపుణుల కమిటీ సూచనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రెండు డోసుల మధ్య వ్యవధి 6 నుంచి 8 వారాలు ఉండగా దాన్ని 12 నుంచి 16 వారాలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇక మరో టీకా కోవాగ్జిన్‌కు సంబంధించి డోసుల మధ్య వ్యవధిలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. అంతకు ముందు డోసుల మధ్య వ్యవధిని పెంచితే వ్యాక్సిన్‌తో మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ సిఫార్సులు చేసింది.

ఈ సిఫార్సుల మేరకు కేంద్రం తాజాగా డోసుల వ్యవధిపై నిర్ణయం తీసుకుంది. కాగా ‘డోసుల మధ్య వ్యవధిని పెంచడం అనేది మంచి శాస్త్రీయ నిర్ణయం. ఇది సామర్థ్యం, ఇమ్యూనిటీ కోణంలో చూస్తే మంచి లాభాలను కలిగిస్తుంది’ అని సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు.



Next Story

Most Viewed