రిపోర్టు లేకున్నా ఆస్పత్రిలో చేర్చుకోవాల్సిందే.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు!

by  |
రిపోర్టు లేకున్నా ఆస్పత్రిలో చేర్చుకోవాల్సిందే.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొవిడ్ లక్షణాలున్నా పాజిటివ్ రిపోర్టు ఉంటేనే ఆస్పత్రుల్లో చేర్చుకుంటామని దేశ వ్యాప్తంగా పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

దీంతో కేంద్రం ఈ మేరకు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల పాలసీలో పలు మార్పులు చేసింది. ఇకపై ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా కరోనా లక్షణాలుంటే చాలు ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కరోనా అనుమానితులు కూడా దేశ వ్యాప్తంగా ఉన్న ఏ ఆస్పత్రిలోనైనా వైద్యం చేయించుకోవచ్చుని పేర్కొన్నది.


Next Story

Most Viewed