40 ఖలిస్తాన్ అనుకూల వెబ్ సైట్లు బ్లాక్ : కేంద్రం

by  |
40 ఖలిస్తాన్ అనుకూల వెబ్ సైట్లు బ్లాక్ : కేంద్రం
X

న్యూఢిల్లీ: నిషేధిత ఖలిస్తాన్ గ్రూపు ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’కు అనుకూలంగా ఉన్న 40 వెబ్‌సైట్లను కేంద్రం బ్లాక్ చేసింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ప్రత్యేక ఖలిస్తాన్ కోసం 2020 రెఫరెండం నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థ ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నది. రష్యా బేస్డ్ వెబ్‌సైట్ల ద్వారా ఈ రెఫరెండానికి మద్దతు దారులను నమోదు చేసుకోవాలని కోరింది. కాగా, ఈ గ్రూపు లీడ్ క్యాంపెయినర్ గుర్పట్‌ వంత్ సింగ్ పన్నును కేంద్రం బుధవారం టెర్రరిస్టుగా ప్రకటించింది.

Next Story

Most Viewed