వరుడిని కాలితో తన్నిన వధువు..తరువాత ఏమైందంటే?

by Disha Web Desk 18 |
వరుడిని కాలితో తన్నిన వధువు..తరువాత ఏమైందంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: పెళ్లి అంటే రెండు అక్షరాలే కానీ, ఇద్దరు వ్యక్తుల వందేళ్ల జీవితం ముడిపడి ఉంటుంది. ఇటీవల వివాహ కార్యక్రమంలో విచిత్ర ఘటనలతో పాటు వినూత్న విన్యాసాలు చోటుచేసుకోవడం తరచూ సోషల్ మీడియాలో చూస్తునే ఉన్నాం. కానీ దీన్ని చూస్తే షాక్ అవ్వాల్సిందే. కొన్ని పెళ్లిళ్లు సరదా సరదాగా జరిగితే..మరికొన్ని తీవ్ర వివాదానికి దారి తీస్తాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లి సందర్భంగా వరుడు వధువుకు స్వీట్ తినిపించడానికి చూస్తాడు. అందుకు వధువు నిరాకరిస్తుంది. వరుడు అంతటితో ఆగకుండా బలవంతంగా తినిపిస్తాడు. దీంతో పెళ్లి కూతురు కోపంతో ఊగిపోయింది. ఈ క్రమంలో వరుడని చూడకుండా కాలుతో తన్నింది. దీంతో వరుడు, పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story