సీనియర్ సిటిజన్స్‌కు కేంద్రం సలహాలు

by  |
సీనియర్ సిటిజన్స్‌కు కేంద్రం సలహాలు
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వాటిలో సీనియర్ సిటిజన్స్ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో 60 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్‌ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే అంశాలపై సలహాలు, సూచనలతో కూడిన ప్రణాళికను ఏయిమ్స్ ఢిల్లీ అధికారులతో కలిసి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలు రూపొందించాయి.

దీని ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* సీనియర్ సిటిజన్స్ రోజులో పూర్తి సమయం ఇంట్లోనే ఉండాలి.
* అతిథులను ఇంటికి ఆహ్వానించడం లాంటివి మానుకోవాలి.
* ఒక వేళ తప్పని సరైతే భౌతిక దూరం పాటించాలి.
* ఒంటరిగా ఉన్న సిటిజన్స్ నిత్యావసర వస్తువుల కోసం ఆరోగ్యంగా ఉన్న పొరగు వారినే ఎంచుకోవాలి.
* వీలైనంత వరకు సమావేశాలు.. జన సమూహాలకు దూరంగా ఉండాలి.
* ఇంట్లో తేలికపాటి ఎక్సర్‌సైజ్‌లు, యోగా లాంటివి చేయాలి.
* ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకుంటూ హైజీన్‌గా ఉండాలి.
* ఆహారం తీసుకునే ముందు, వాష్ రూం వెళ్లి వచ్చాక సబ్బు నీళ్లతో 20 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలి.
* కళ్లద్దాల లాంటి తరుచుగా టచ్ చేసే వస్తువులను తాకినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి.
* తుమ్ములు, దగ్గులు వచ్చినప్పుడు టిష్యూ పేపర్, హ్యాండ్ కర్చీఫ్ వంటి వాటిని ఉపయోగించాలి.
* అనంతరం వాటిని డస్ట్ బిన్‌లో పడవేయాలి.
* ఇంట్లో తయారు చేసిన సరైన పోషకాలు గల వేడి వంటకాలను తింటూ ఉండాలి.
* తరుచుగా బాడీనీ హైడ్రేట్ చేస్తూ ఉండాలి.
* ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ ఉండాలి.
* మీరు రోజూ వాడాల్సిన ఔషదాలను సమయం ప్రకారం వేసుకోండి.
* ఎప్పటి కప్పుడు మీ ఆరోగ్యాన్ని మానిటర్ చేసుకోండి. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీయడంలో ఇబ్బంది, ఏ ఇతర అనారోగ్య సమస్యలు కనిపించిన వెంటనే దగ్గరలోని వైద్యులను సంప్రదించండి.
* అవసరం మేరకు మాత్రమే మీ కుటుంబ సభ్యులతో(మీ దగ్గర లేని వారు), బంధువులు, స్నేహితులతో కాల్స్‌లో గానీ వీడియో కాన్ఫరెన్స్ లో గానీ మాట్లాడుతూ ఉండండి.

చేయకూడనివి

* కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వారిని తాక కూడదు. షేక్‌హ్యాండ్, హగ్ చేసుకోవడం చేయకూడదు.
* పార్క్స్, మార్కెట్, మత సంబంధ ప్రదేశాలకు దూరంగా ఉండండి
* చేతుల్లో డైరెక్ట్‌గా తుమ్మడం, దగ్గడం చేయకూడదు.
* కండ్లు, ముఖం, ముక్కులను టచ్ చేయకూడదు.
* డాక్టర్ సూచన లేకుండా ఔషదాలు వాడకూడదు.
* రొటీన్ చెకప్‌ల కోసం ఆస్పత్రులకు వెళ్లకుండా వీలైనంత వరకు టెలీఫోన్ ద్వారా సంప్రదించాలి.

డిపెండెంట్ సిటిజన్స్‌ను చూసుకునే వారు చేయాల్సినవి

* వృద్దులకు సహాయం చేసే ముందు చేతులను శుభ్రం చేసుకోవాలి.
* వారికి సహాయం చేసే ముందు మీ నోరు, ముక్కును టిష్యూ లేదా క్లాత్‌లతో కవర్ చేసుకోవాలి.
* వారు తరుచుగా వాకింగ్, వీల్ చైర్, వాకింగ్ స్టిక్‌లు ఉపయోగించే ప్రదేశాలను తరుచూ శుభ్రపరుస్తూ ఉండాలి.
* వారికి చేతులు కడుక్కోవడంలో అవసరమైన సహాయం చేయాలి.
* వారు సరైన ఆహారం, వాటర్ తీసుకుంటున్నారో లేదో చూడాలి.
* వారి ఆరోగ్యాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి.
చేయకూడనివి:
వారు జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారికి దూరంగా ఉండి గమనిస్తూ ఉండాలి.
* చేతులు కడుక్కోకుండా వారిని తాక కూడదు.

సీనియర్ సిటిజన్స్ మానసిక ఆరోగ్యం కోసం

* ఇంట్లో ఉండే సభ్యులతో కమ్యూనికేట్ అవుతూ ఉండాలి.
* పొరుగు వారితో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు భౌతిక దూరానికి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉండేలా చూసుకోవాలి.
* వారికి మంచి ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
* పెయింటింగ్, మ్యూజిక్ వినడం, చదవటం లాంటి పాత అలవాట్లును మళ్లీ చేస్తే బాగుంటుంది.
* పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.
* వారికి ఇదివరకే ఏమైనా మానసిక సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్(08046110007)కు కాల్ చేయాలి.

చేయకూడనివి

* సీనియర్ సిటిజన్స్ సెల్ఫ్ ఐసోలేట్ చేసుకోవడం.
* ఒకే రూమ్‌కు పరిమితమవ్వడం
* సెన్సేషనల్ న్యూస్, సోషల్ మీడియా పోస్టులకు దూరంగా ఉండాలి.
* మానసిక స్థితిలో మార్పు వచ్చిన అంటే పగలు సమయంలో అధికంగా మగతగా ఉండటం, సరిగ్గా మాట్లాడలేకపోతున్నా ఇతర సమస్యలు ఎదురైనా హెల్స్ లైన్ ను సంప్రదించాలి.

Next Story

Most Viewed