- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జశ్వంత్ సింగ్‌కు ప్రముఖుల సంతాపం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ ఇవాళ ఉదయం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణావార్త తెలిసిన పలువు తీవ్ర దిగ్భ్రంతికి గురయ్యారు. సైనికుడిగా, రాజకీయ నేతగా దేశానికి ఆయన అమోఘమైన సేవలు అందించారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ ఇవాళ ఉదయం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణావార్త తెలిసిన పలువు తీవ్ర దిగ్భ్రంతికి గురయ్యారు. సైనికుడిగా, రాజకీయ నేతగా దేశానికి ఆయన అమోఘమైన సేవలు అందించారని కొనియాడారు.
ఈ సందర్భంగా ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ తన సందేశంలో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ, ఆర్ధిక శాఖ మంత్రిగా పనిచేసిన జస్వంత్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన సంతాప సందేశంలో జస్వంత్ తో తనకున్న అనుభవాన్ని గుర్తుకుతెచ్చుకున్నారు. జస్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Next Story






