- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు
<p>దిశ ఏపీ బ్యూరో: కడప జిల్లా పులివెందుల మాజీ ఎంపీ, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. తొలి రోజు ఈ కేసులో ఫైళ్లను సిట్ నుంచి స్వాధీనం చేసుకున్న సీబీఐ, సిట్ అధికారులు, డీఎస్పీల నుంచి కేసుపై పూర్తి వివరాలు సేకరించారు. తరువాతి రోజు వివేకా ఇంటి పరిసరాల్లోని వారిని విచారించారు. ఆ తరువాత వివేకా కుమార్తె నుంచి పలు విషయాలు తెలుసుకున్నారు. అనంతరం వాచ్ మెన్ రంగన్నను విచారించారు. […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: కడప జిల్లా పులివెందుల మాజీ ఎంపీ, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. తొలి రోజు ఈ కేసులో ఫైళ్లను సిట్ నుంచి స్వాధీనం చేసుకున్న సీబీఐ, సిట్ అధికారులు, డీఎస్పీల నుంచి కేసుపై పూర్తి వివరాలు సేకరించారు. తరువాతి రోజు వివేకా ఇంటి పరిసరాల్లోని వారిని విచారించారు. ఆ తరువాత వివేకా కుమార్తె నుంచి పలు విషయాలు తెలుసుకున్నారు. అనంతరం వాచ్ మెన్ రంగన్నను విచారించారు. వివేకా ఇల్లంతా తిరిగి పరిశీలించారు. తాజాగా టెక్నిలక్ టీమ్‌ను రంగంలోకి దించారు. వివేకాతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి కాల్ డేటా, ఎస్ఎమ్ఎంస్‌లను విశ్లేషించనున్నారు. దీంతో వివేకానందరెడ్డి హత్యపై క్లారిటీ వస్తుందని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
Next Story






