- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో మరోసారి సీబీఐ సోదాల కలకలం
హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలుచోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో మరోసారి సీబీఐ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఓల్డ్ సిటీలోని మొత్తం ఆరు చోట్ల సీబీఐ అధికారులు శనివారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. చంచల్ గూడలోని ఒవైసీ హాస్పిటల్ డాక్టర్ అంజూమ్ సుల్తానా ఇంట్లో సీబీఐ సోదాలు చేస్తోంది. అంజూమ్ సుల్తానా భర్త ఓ ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపులు, అవకతవకల విషయంలో గతంలో సీబీఐ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఇవాళ రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ అంజూమ్ సుల్తానా నివాసంతో పాటు సదరు ఆటో మొబైల్ కంపెనీకి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న వారి నివాసాలు, సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఏక కాలంలో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Next Story






