- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సొంత హెడ్ క్వార్టర్స్‌లో CBI దాడులు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : సొంత హెడ్ క్వార్టర్స్ పైనే CBI(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ) అధికారులు దాడులు నిర్వహించారు. అంతకుముందు సీబీఐలో పనిచేస్తున్న నలుగురు అధికారులు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయమైన CGO కాంప్లెక్స్‌లో అధికారులు తనిఖీలు చేశారు. వీరంతా ఓ కంపెనీ నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అందులో స్వయాన డీఎస్పీ స్థాయి అధికారితో పాటు మరో ముగ్గురు ఉన్నట్లు దర్యాప్తు సంస్థ అధికారులు […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : సొంత హెడ్ క్వార్టర్స్ పైనే CBI(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ) అధికారులు దాడులు నిర్వహించారు. అంతకుముందు సీబీఐలో పనిచేస్తున్న నలుగురు అధికారులు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయమైన CGO కాంప్లెక్స్‌లో అధికారులు తనిఖీలు చేశారు. వీరంతా ఓ కంపెనీ నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అందులో స్వయాన డీఎస్పీ స్థాయి అధికారితో పాటు మరో ముగ్గురు ఉన్నట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.
ఈ కేసులో సీబీఐ హెడ్ క్వార్టర్స్ తో పాటు వివిధ చోట్ల గల మరో 14 ప్రదేశాల్లో అధికారులు దాడులు జరిపారు. అందులో అవినీతికి పాల్పడిన అధికారులకు మధ్యవర్తిత్వం చేసే వారు, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇళ్లు కూడా ఉన్నట్లు సమాచారం. వీరంతా ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కంపెనీ నుంచి లంచం పొందినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు సొంత కార్యాలయం మీదే తనిఖీలు జరిపారని తెలుస్తోంది.






