- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూపీ లాగుతున్న సీబీఐ.. పులివెందులకు వివేకా కుమార్తె
by Vadlamudi Anukaran |
<p>దిశ, ఏపీ బ్యూరో: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసును ఛేదించేందుకు సీబీఐ నడుంబిగించింది. రెండు రోజులుగా ఈ కేసుపై కసరత్తు చేస్తోంది. తొలి రోజు ఈ కేసులో పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సేకరించిన వివరాలను అధ్యయనం చేసింది. ఈ క్రమంలో సిట్ అధికారిని ప్రశ్నించి పలు వివరాలు తెలుసుకుంది. నిన్న పులివెందులలో వైఎస్ వివేకా ఇంటికి వెళ్లి సంఘటనా స్థలిని పరిశీలించింది. ఈ రోజు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసును ఛేదించేందుకు సీబీఐ నడుంబిగించింది. రెండు రోజులుగా ఈ కేసుపై కసరత్తు చేస్తోంది. తొలి రోజు ఈ కేసులో పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సేకరించిన వివరాలను అధ్యయనం చేసింది. ఈ క్రమంలో సిట్ అధికారిని ప్రశ్నించి పలు వివరాలు తెలుసుకుంది. నిన్న పులివెందులలో వైఎస్ వివేకా ఇంటికి వెళ్లి సంఘటనా స్థలిని పరిశీలించింది. ఈ రోజు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత హైదరాబాద్ నుంచి పులివెందుల చేరుకున్నారు. కాసేపట్లో ఆమె సీబీఐ అధికారులతో మాట్లాడనున్నారు.
Next Story






