- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. నేడు కోర్టుకు కీలక నేత
<p>దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గోవాలో సోమవారం అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు మంగళవారం కడపకు తీసుకువచ్చి విచారిస్తున్నారు. బుధవారం కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. మంగళవారం వైఎస్ వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలతో కలిపి సునీల్ కుమార్ యాదవ్‌ను విచారించి కీలక సమాచారాన్ని సీబీఐ […]</p>

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గోవాలో సోమవారం అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు మంగళవారం కడపకు తీసుకువచ్చి విచారిస్తున్నారు. బుధవారం కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
మంగళవారం వైఎస్ వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలతో కలిపి సునీల్ కుమార్ యాదవ్‌ను విచారించి కీలక సమాచారాన్ని సీబీఐ సేకరించినట్లు తెలుస్తోంది. అయితే బుధవారం మాత్రం సునీల్‌కుమార్ యాదవ్‌ను మాత్రమే విచారిస్తున్నారు. విచారణ అనంతరం కడప కోర్టులో సునీల్ కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సునీల్ కుమార్ యాదవ్ వైసీపీలో కీలకంగా వ్యవహరించేవాడని తెలుస్తోంది. గత ఎన్నికల్లో కూడా వైసీపీ తరపున చేపట్టిన అనేక కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారని ప్రచారం జరుగుతుంది.






