- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరి ముందే.. అలా చేసిన మహిళా క్రికెటర్
<p>దిశ, స్పోర్ట్స్: భారత మహిళా జట్టు బ్యాటర్ పూనమ్ రౌత్ క్రీడాస్పూర్తికి ఆసీస్ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. గోల్డ్‌కోస్ట్ వేదికగా ఇండియా – ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య పింక్ బాల్ టెస్టు జరుగుతున్నది. మ్యాచ్ రెండో రోజు భారత జట్టు తొలి ఇన్నింగ్స్ కొనసాగించింది. సెంచరీ చేసిన అనంతరం స్మృతి మంధాన (127) అవుటై పెవీలియన్ చేరింది. ఇక మంధానకు చాలా సేపు క్రీజులో తోడుగా నిలిచిన పూనమ్ రౌత్ ఆసీస్ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టింది. 165 […]</p>

దిశ, స్పోర్ట్స్: భారత మహిళా జట్టు బ్యాటర్ పూనమ్ రౌత్ క్రీడాస్పూర్తికి ఆసీస్ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. గోల్డ్‌కోస్ట్ వేదికగా ఇండియా – ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య పింక్ బాల్ టెస్టు జరుగుతున్నది. మ్యాచ్ రెండో రోజు భారత జట్టు తొలి ఇన్నింగ్స్ కొనసాగించింది. సెంచరీ చేసిన అనంతరం స్మృతి మంధాన (127) అవుటై పెవీలియన్ చేరింది. ఇక మంధానకు చాలా సేపు క్రీజులో తోడుగా నిలిచిన పూనమ్ రౌత్ ఆసీస్ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టింది. 165 బంతులు ఆడిన పూనమ్ 36 పరుగులు చేసిందంటే.. ఎంత డిఫెన్సీవ్‌గా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. పూనమ్ ఒక ఎండ్‌లో అలా పాతుకొని పోవడం వల్లే స్మృతి స్వేచ్ఛగా ఆడగలిగింది. అయితే పూనమ్ రౌత్ (36) మోలిన్యూక్స్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి ఎడ్జ్ తీసుకొని హేలీ చేతిలో పడింది. ఆసీస్ క్రికెటర్లు గట్టిగా అప్పీల్ చేసినా అంపైర్ మాత్రం అవుట్ ఇవ్వలేదు. కానీ, పూనమ్ మాత్రం బ్యాట్ కు బంతి తగిలిందని గ్రహించి క్రీజును వీడి వెళ్లిపోయింది. పూనమ్ రౌత్ క్రీడా స్పూర్తికి ఆసీస్ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. అంపైర్ కూడా పూనమ్‌ను చూస్తూ ఉండిపోయాడు. ఆ వీడియోను బీసీసీఐ సహా క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్‌లో షేర్ చేసింది. పూనమ్‌ను సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.






