- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పక్షి తెలివికి నెటిజన్స్ ఫిదా
<p>దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏ మూలన ఏది జరిగినా ఇట్టే తెలిసి పోతుంది. ఇక వింతలూ విడ్డూరాలకైతే కొదవేలేదు. సామాజిక మాధ్యమాల ద్వారా పక్షలు, జంతువులకు సంబంధించిన ఎన్నో అందమైన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఏంటీ అనుకుంటున్నారా..? భూమి పై పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు అనేది జీవిత సత్యం అయినా జీవితం […]</p>

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏ మూలన ఏది జరిగినా ఇట్టే తెలిసి పోతుంది. ఇక వింతలూ విడ్డూరాలకైతే కొదవేలేదు. సామాజిక మాధ్యమాల ద్వారా పక్షలు, జంతువులకు సంబంధించిన ఎన్నో అందమైన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఏంటీ అనుకుంటున్నారా..? భూమి పై పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు అనేది జీవిత సత్యం అయినా జీవితం పై ఏదో ఆశ.
మనం మన ప్రాణానికి హాని కలిగించే ప్రమాదం ఎదురైతే చాలు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి మన ప్రాణాలు కాపాడుకుంటాం. మనుషులే కాదు పక్షులు, జంతువులు కూడా అంతే. అలానే ఓ పక్షి తన తెలివిని ప్రదర్శించి తన ప్రాణాలను కాపాడుకుంది. ఎలా అనుకుంటున్నారా.. మీరే చదవండి. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ఓ పిల్లి చిన్న పిచ్చుకను పట్టుకొని వచ్చింది. హమ్మయ్యా .. ఇవ్వాల్టికి భోజనం దొరికిందని ఆ పిట్టను స్వాహా చేద్దాం అనుకుంది. కానీ ఆ పక్షి ఎంతకూ కదలలేదు. చనిపోయినదానిలా పడి ఉంది. అది చనిపోయిందని గ్రహించిన పిల్లి కాస్త రిలాక్స్ అయ్యింది. ఇంకేం కానిచ్చేద్దాం అనుకుని వివాహా భోజనంభు వింతైన వంటకంబు అనుకుంటూ తినడానికి ప్రయత్నించింది. అంతలో ఆ పిట్ట తుర్రు మంది తెలివితో తన ప్రాణాలను కాపాడుకున్న పక్షిని చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
https://twitter.com/susantananda3/status/1377502026569981953?s=20






