- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఆసుపత్రి పై కేసు నమోదు… ఎందుకంటే..?
<p>దిశ, వేములవాడ: కరోనా పరీక్షల్లో తప్పుడు రిపోర్ట్ ఇచ్చినందుకు వేములవాడ పట్టణంలోని మాతృశ్రీ కొవిడ్ ఆస్పత్రిపై బాధితురాలు మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని టౌన్ సీఐ వెంకటేశ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిట్టి మంగమ్మ అనే పేషెంట్ స్వల్ప లక్షణాలతో మాతృశ్రీ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆమెను పరీక్షించి సిటిస్కాన్, రక్త పరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిందని ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని వైద్యులు ఆమెకు సూచించారు. దాదాపుగా రూ. లక్షా […]</p>

దిశ, వేములవాడ: కరోనా పరీక్షల్లో తప్పుడు రిపోర్ట్ ఇచ్చినందుకు వేములవాడ పట్టణంలోని మాతృశ్రీ కొవిడ్ ఆస్పత్రిపై బాధితురాలు మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని టౌన్ సీఐ వెంకటేశ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిట్టి మంగమ్మ అనే పేషెంట్ స్వల్ప లక్షణాలతో మాతృశ్రీ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆమెను పరీక్షించి సిటిస్కాన్, రక్త పరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిందని ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని వైద్యులు ఆమెకు సూచించారు.
దాదాపుగా రూ. లక్షా 50 వేలు ఖర్చు అవుతాయని తెలపడంతో, మంగమ్మ డబ్బులు లేక వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ వచ్చింది. నెగటివ్ రిపోర్టు ఆధారంగా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పూర్తి విచారణ చేసి ఆస్పత్రి పై చర్యలు తీసుకుంటామని టౌన్ సీఐ వెంకటేశ్ తెలిపారు.






