- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టు ధిక్కరణ కింద పది మందిపై కేసు
by Shyam |
<p>దిశ, స్టేషన్ ఘన్ పూర్: కోర్టు ధిక్కరణ కింద ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌లో పది మందిపై కేసు నమోదు అయింది. తహసిల్దార్, పీఓ, వీఆర్ఓతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రమేశ్ యాదవ్ వివరాల ప్రకారం… మండలంలోని రాంపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 558/ ఏ, 560 లో గల భూమి కోర్టు వివాదంలో ఉంది. కాగా ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం దాన్ని వెంచర్‌గా చేసి అమ్మడాన్ని కోర్టు […]</p>

X
దిశ, స్టేషన్ ఘన్ పూర్: కోర్టు ధిక్కరణ కింద ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌లో పది మందిపై కేసు నమోదు అయింది. తహసిల్దార్, పీఓ, వీఆర్ఓతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రమేశ్ యాదవ్ వివరాల ప్రకారం… మండలంలోని రాంపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 558/ ఏ, 560 లో గల భూమి కోర్టు వివాదంలో ఉంది. కాగా ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం దాన్ని వెంచర్‌గా చేసి అమ్మడాన్ని కోర్టు తప్పుపట్టింది. దీంతో తహసిల్దార్ రవీందర్ రెడ్డి, పీ.ఓ అభిజిత్ రెడ్డి, వీఆర్‌ఓ రంజిత్ రెడ్డితో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశించింంది. ఈ మేరకు వారిపై ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story






