- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ నటి రాధ ప్రశాంతిపై కేసు నమోదు
<p>దిశ, వెబ్‌డెస్క్: మద్యం తాగి వచ్చి సినీ నటి రాధ ప్రశాంతి దాడి చేశారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అపార్ట్‌మెంట్ వాచ్ మెన్‌పై రాధ ప్రశాంతి దాడి చేశారని ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ బాధితురాలితో పాటు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మద్యం తాగి వచ్చి కూర్చి పగుల గొట్టారని.. అంతేకాకుండా, ఇదేంటి అని అడిగినందుకు తన గొంతు పట్టి హత్య చేయబోయిందని బాధితురాలు వాపోయారు. అయితే, గొడవ జరుగుతున్న సమయంలో వచ్చిన సాఫ్ట్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: మద్యం తాగి వచ్చి సినీ నటి రాధ ప్రశాంతి దాడి చేశారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అపార్ట్‌మెంట్ వాచ్ మెన్‌పై రాధ ప్రశాంతి దాడి చేశారని ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ బాధితురాలితో పాటు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మద్యం తాగి వచ్చి కూర్చి పగుల గొట్టారని.. అంతేకాకుండా, ఇదేంటి అని అడిగినందుకు తన గొంతు పట్టి హత్య చేయబోయిందని బాధితురాలు వాపోయారు.
అయితే, గొడవ జరుగుతున్న సమయంలో వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆ తతంగాన్ని మొత్తం చిత్రీకరించారు. అయితే, తనపై కూడా దాడి చేయడానికి రాధ ప్రశాంతి బంధువుల ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై స్పందించిన రాధ ప్రశాంతి తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కావాలనే ఆ గొడవను చిత్రీకరించారని చెప్పుకొచ్చారు. తన బంధువులు వస్తే వాచ్ మెన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు.






