బిగ్ బ్రేకింగ్ : మంత్రి వేముల పీఆర్వోపై కేసు.. అందుకేనా..?

by  |
vemulaa
X

దిశ ప్రతినిది, కరీంనగర్ : పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పీఆర్వో తోట శ్రీకాంత్ పై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం ఏదులపూర్‌కు చెందిన తన భర్త శ్రీకాంత్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తూ దాడి చేశాడని కోమల మంథని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. మంథని మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన తనకు కాల్వ శ్రీరాంపూర్ మండలం ఎదులాపురం గ్రామానికి చెందిన తోట శ్రీకాంత్‌తో 2016లో వివాహం జరిగిందని.. నాలుగేళ్లుగా కాపురం సక్రమంగానే చేశాడని వివరించింది.

రెండేళ్ల క్రితం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వద్ద పీఆర్వోగా పని చేస్తున్నప్పటీ నుండి తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని వివరించింది. అప్పటి నుండి ఫోన్ చేస్తే వీలు కావడం లేదు, సార్‌తో కలిసి బయటకు వెళ్తున్నానని చెప్పేవాడని, మూడు నెలలు చూసి మళ్లీ కాల్ చేస్తే కరోనా కారణం చెప్పాడని తెలిపింది. మళ్లీ రెండు నెలల తరువాత కాల్ చేస్తే ఏం చేసుకుంటావో చేసుకుంటావో చేసుకో పో అన్నాడని చెప్పింది. మెట్టినింటికి పెద్ద మనుషులతో కలిసి వెళ్లితే మాకేం సంబంధం లేదని అత్తామామలు చెప్పారని వాపోయింది. ఆ తరువాత మళ్లీ శ్రీకాంత్‌కు కాల్ చేసి అడిగితే నేను వస్తా.. వచ్చిన తరువాత తీసుకెళ్తానని అనడంతో గట్టిగా అడిగానని.. దీంతో తన నెంబర్ బ్లాక్ చేశాడని కోమల ఆవేదన వ్యక్తంచేసింది.

దీపావళి పండగ సమయంలో ఎదులాపురం వెళ్లానని, పండగ అని చూడకుండా అత్తా మామలు కలిసి తీవ్రంగా కొట్టడంతో పాటు సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లి తనను చున్నితో చంపేసే ప్రయత్నం చేశారని కన్నీరు పెట్టుకుంది. పుట్టింటికి కాల్ చేసి చెప్పగా తన తమ్ముడు గాజులపల్లికి వచ్చి తీసుకెళ్ళాడని తెలిపింది. ఎన్ని డబ్బులు అయినా ఇచ్చి విడిపోతా, ఎన్ని పోలీస్ స్టేషన్ల చుట్టయినా తిరుగుతాను, ఏం చేసుకుంటావో చేసుకోపో అంటున్నాడని కోమల వివరించింది. ఆదివారం ఎదులాపురంలో పంచాయితీ ఉన్నదంటే వెళ్లామని అక్కడ కూడా శ్రీకాంత్ తనను తీవ్రంగా కొట్టాడని.. వేరే అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్నాడని, అందువల్లే ఇలా చేస్తున్నాడని ఆరోపించింది. కోమల ఫిర్యాదు మేరకు మంథని పోలీసులు శ్రీకాంత్ పై 498ఏ కేసు నమోదు చేసినట్టు మంథని పోలీసులు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed