Jobs: డిగ్రీ అర్హతతో.. యూనియన్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు

by Phanindra |

బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వారికీ యూనియన్‌ బ్యాంక్‌ (Union Bank) గుడ్ న్యూస్ చెప్పింది.

Jobs: డిగ్రీ అర్హతతో.. యూనియన్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉపాధి లేక యువతీ యువకులు సతమవుతున్నారు. అర్హత ఉన్నా కూడా ఉద్యోగం దొరకడం కష్టమవుతుంది. బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వారికీ యూనియన్‌ బ్యాంక్‌ (Union Bank) గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ (apprenticeship) ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ క్రమంలోనే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, మొత్తం 2691 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 5 వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్‌ కి సంబంధించిన వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు.

రాష్ట్రాల వారిగా అప్రెంటిస్‌ ఖాళీలు : 2691

ఒడిశా- 53

కేరళ- 118

తమిళనాడు- 122

మహారాష్ట్ర- 296

తెలంగాణ- 304

కర్ణాటక- 305

ఆంధ్రప్రదేశ్‌- 549

కావాల్సిన అర్హతలు:

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో పాస్ అయి ఉండాలి.

వయోపరిమితి: 2025 ఫిబ్రవరి 1 నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

స్టైపెండ్: ఎంపికైన వారికి నెలకు రూ.15,000 ఇస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 5, 2025

Next Story