- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలిసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు.. అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి ఇక్కడ
తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG POLYCET) కౌన్సెలింగ్ 2025-2026 విద్యా సంవత్సరానికి గాను మొదటి దశ సీట్ల కేటాయించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG POLYCET) కౌన్సెలింగ్ 2025-2026 విద్యా సంవత్సరానికి గాను మొదటి దశ సీట్ల కేటాయించారు. ఈ మేరకు సీట్లు పొందిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgpolycet.nic.in/Default.aspxలోకి వెళ్లి అలాట్‌మెంట్ అర్డర్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థలకు సీట్లను అలాట్ చేశారు. ఫస్ట్ ఫేజ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు నేటి నుంచే ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయవచ్చు. అందుకు జూలై 18 చివరి తేదీగా ప్రకటించారు.
జూలై 23 నుంచి రెండో విడత కౌన్సెలింగ్..
పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. జూలై 24 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు. జూలై 25న అభ్యర్థులకు సీట్లు కేటాయింపు ఉంటుంది. జూలై 31 నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ ఏడాది పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో మొత్తం 80,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28,632 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి కొత్తగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 2 ప్రభుత్వ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలల సంఖ్య 57 నుంచి 59కి పెరిగింది.






