TG EAPCET (బైపీసీ) తుది విడత కౌన్సెలింగ్.. 10,595 సీట్ల కేటాయింపు

by Kema Shiva Kumar |

2025-2026 విద్యా సంవత్సరానికి గానూ బీ ఫార్మసీ, ఫార్మ్ డీ, ఫార్మాస్యూటికల్స్ ఇంజనీరింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్, బయో-టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈఏపీసెట్ (బీ)-2025 తుది విడత కౌన్సెలింగ్‌లో 96.67 శాతం సీట్లు కేటాయించారు.

TG EAPCET (బైపీసీ) తుది విడత కౌన్సెలింగ్.. 10,595 సీట్ల కేటాయింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: 2025-2026 విద్యా సంవత్సరానికి గానూ బీ ఫార్మసీ, ఫార్మ్ డీ, ఫార్మాస్యూటికల్స్ ఇంజనీరింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్, బయో-టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈఏపీసెట్ (బీ)-2025 తుది విడత కౌన్సెలింగ్‌లో 96.67 శాతం సీట్లు కేటాయించారు. సీట్ల కేటాయింపు వివరాలను టీజీఈఏపీసెట్ (బైపీసీ)-2025 అడ్మిషన్ల కన్వీనర్ దేవసేన ఇవాల వెల్లడించారు. తుది విడతలో మొత్తం 10,595 (96.67 శాతం) మంది సీట్లు పొందారని తెలిపారు. మొత్తం 10,960 సీట్లు అందుబాటులో ఉండగా.. 365 సీట్లు మాత్రమే మిగిలాయని పేర్కొన్నారు. ఈడబ్లూఎస్ కోటా కింద 536 మంది సీట్లు సాధించారని వెల్లడించారు.

ఇక 68 కాలేజీలు వందశాతం అడ్మిషన్లు సాధించాయని.. అభ్యర్థులు తమ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ట్యూషన్ ఫీజు ఆన్‌లైన్ ద్వారా ఈనెల 22లోగా చెల్లించాలన్నారు. ట్యూషన్ ఫీజు చెల్లించిన తర్వాత అభ్యర్థులు తప్పనిసరిగా https://tgeapcetb.nic.in వెబ్‌సైట్‌లో ‘సెల్ఫ్-రిపోర్టింగ్ సిస్టమ్’ ద్వారా రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఫీజు చెల్లించడంలో సెల్ఫ్-రిపోర్టింగ్ సిస్టమ్ ద్వారా రిపోర్ట్ చేయడంలో విఫలమైతే తాత్కాలికంగా కేటాయించిన సీటు రద్దు అవుతుందని వెల్లడించారు. అభ్యర్థులు తాత్కాలికంగా కేటాయించిన కాలేజీలో ఈనెల 23లోగా వ్యక్తిగతంగా రిపోర్ట్ చేయాలన్నారు. సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC)ని కూడా అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు ఎప్పటికప్పుడు https://tgeapcetb.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కన్వీనర్ సూచించారు.

Next Story