తెలంగాణ దోస్త్ - 2023 నోటిఫికేషన్.. అడ్మిషన్ షెడ్యూల్ ఇదే..!

by Disha Web Desk 17 |
తెలంగాణ దోస్త్ - 2023 నోటిఫికేషన్.. అడ్మిషన్ షెడ్యూల్ ఇదే..!
X

దిశ, ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 2023- 24 విద్యా సంవత్సరం ప్రవేశానికి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ - తెలంగాణ (దోస్త్) రిజిస్ట్రేషన్ కాలపట్టిక విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3,86,544 డిగ్రీ సీట్లు భర్తీ కానున్నాయి. ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

దోస్త్ షెడ్యూల్:

మొదటి విడత:

మే 16 నుంచి జూన్ 10 వరకు రిజిస్ట్రేషన్లు.

ఫీజు: రూ. 200 చెల్లించాలి.

వెబ్‌ ఆప్షన్లు: మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్లు ఉంటాయి.

సీట్ల కేటాయింపు: జూన్ 16.

ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ - జూన్ 16 నుంచి 25 వరకు ఉంటుంది.

రెండో విడత:

రిజిస్ట్రేషన్ : జూన్ 16 నుంచి 26 వరకు ఉంటుంది.

ఫీజు: రూ. 400 చెల్లించాలి.

వెబ్ ఆప్షన్లు: జూన్ 16 నుంచి 27 వరకు ఉంటుంది.

సీట్ల కేటాయింపు: జులై 30.

ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ : జులై 1 నుంచి 5 వరకు.

మూడో విడత: జులై 1 నుంచి 5 వరకు

ఫీజు: రూ. 400 చెల్లించాలి.

జులై 1 నుంచి 6 వరకు

సీట్ల కేటాయింపు : జులై 10న కేటాయిస్తారు.

ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జులై 10 నుంచి 14 వరకు ఉంటుంది.

కళాశాలల్లో రిపోర్టింగ్: జులై 10 నుంచి 15 వరకు.

తరగతులు ప్రారంభం: జులై 17, 2023.

వెబ్‌సైట్: https://dost.cgg.gov.in/

Also Read..

తెలంగాణ కోర్టుల్లో 144 టైపిస్ట్ పోస్టులు


Next Story

Most Viewed