తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్స్.. నోటిఫికేషన్ విడుదల

by Ramesh Naini |

రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ శుక్రవారం విడుదల చేశారు.

తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్స్.. నోటిఫికేషన్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ శుక్రవారం విడుదల చేశారు. ఆరవ తరగతిలో కొత్త ప్రవేశాలతో పాటు, 7 నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 28 నుండి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 9 న హాల్ టికెట్ల డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా, ఏప్రిల్ 19 పరీక్ష నిర్వహించనున్నారు. 6వ తరగతి కి సంబందించి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతి వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత మండలాల్లోని పాఠశాలల్లోనే పరీక్ష నిర్వహించబడతాయన్నారు. ఓసీ విద్యార్థులకు విద్యార్థులకు రూ. 200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రూ. 125 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgms.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపారు.

Next Story