- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Inter Board : తెలంగాణ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం
తెలంగాణ ఇంటర్‌బోర్డు ఇంటర్మీడియట్(Telangana Inter Board) వార్షిక పరీక్షల(Annual exams)కు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందే(15 minutes Before the Exam) పరీక్షా సెంటర్ల గేట్లు క్లోజ్ (Exam Center Gates Close)చేయాలని నిర్ణయించింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఇంటర్‌బోర్డు ఇంటర్మీడియట్(Telangana Inter Board) వార్షిక పరీక్షల(Annual exams)కు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందే(15 minutes Before the Exam) పరీక్షా సెంటర్ల గేట్లు క్లోజ్ (Exam Center Gates Close)చేయాలని నిర్ణయించింది. ఉదయం 8:45 గంటలలోపు వచ్చిన వారినే పరీక్షకు అనుమతించనున్నారు. ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని నిర్ణయించింది. విద్యార్థులు ఉదయం 8:30గంటలకల్లా పరీక్షాహాల్లో ఉండాలన్న నిబంధనను బోర్డు తొలిసారిగా అమల్లోకి తీసుకొచ్చింది
. ఏవైనా సందేహాలుంటే 92402 05555 టోల్ ఫ్రీ నంబర్‌తోపాటు, జిల్లా కంట్రోల్ రూం ఇన్‌చార్జి నంబర్లను సంప్రదించవచ్చని సూచించింది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేయగా.. 9,96,541 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం వారు 4,88,316 ఉండగా, 5,08,225 మంది ద్వితీయ సంవత్సంర విద్యార్థులున్నారు. ఇంటర్ పరీక్షల్లో నిమిషం ఆలస్యంగా వచ్చిన వారికి పరీక్ష కేంద్రంలోకి నో ఎంట్రీ నిబంధన చాలా కాలంగా అమలవుతున్నది.
2024 మార్చి వార్షిక పరీక్షలలో తొలిరోజే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి సెంటర్‌కు ఆలస్యంగా చేరుకోవడం, సదరు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనమైంది. దీంతో ప్రభుత్వం మిషం నిబంధనను సడలించి, ఐదు నిమిషాల వరకు మినహాయింపు ఇచ్చింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ సమయంలోనూ ఐదు నిమిషాలు ఆలస్యం నిబంధన అమలయ్యింది. ఈ దఫా వార్షిక పరీక్షలలో 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్‌చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఎంతమంది విద్యార్థులు ఈ నిబంధన బారిన పడనున్నారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.






