Job News: లక్షా 80 వేల జీతం.. నిరుద్యోగుల కోసమే ఈ నోటిఫికేషన్‌..త్వరగా అప్లై చేయండి!

by Vennela |

ONGC Recruitment 2025: ONGCలో 108 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జనవరి 24 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది.

Job News:  లక్షా 80 వేల జీతం.. నిరుద్యోగుల కోసమే ఈ నోటిఫికేషన్‌..త్వరగా అప్లై చేయండి!
X

ONGC Jobs: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC) లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 108 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌(ONGC Recruitment 2025)ను మిస్‌ చేసుకోవద్దు.

ప్రస్తుతం కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 24తో ముగియనుంది. 2025 ఫిబ్రవరి 23న సీబీటీ నిర్వహించనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద సంస్థలో ఏఈఈ(AEE), జియాలజిస్ట్(Geophysict), జియోఫిజిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి:

→ జియాలజిస్ట్: 5 పోస్టులు

→ జియోఫిజిస్ట్ (సర్ఫేస్ ఫ్లోర్): 3 పోస్టులు

→ జియోఫిజిస్ట్ (వేల్స్): 2 పోస్టులు

→ ఏఈఈ (ప్రొడక్షన్)- మెకానికల్: 11 పోస్టులు

→ ఏఈఈ (ప్రొడక్షన్)- పెట్రోలియం: 19 పోస్టులు

→ ఏఈఈ (ప్రొడక్షన్)- కెమికల్స్: 23 పోస్టులు

→ ఏఈఈ (డ్రిల్లింగ్)- మెకానికల్: 23 పోస్టులు

→ ఏఈఈ (డ్రిల్లింగ్)- పెట్రోలియం: 6 పోస్టులు

→ ఏఈఈ (మెకానికల్): 6 పోస్టులు

→ ఏఈఈ (ఎలక్ట్రికల్): 10 పోస్టులు

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.60 వేల నుంచి రూ.1,80,000 వరకు వేతనం చెల్లిస్తారు.

ఏఈఈ (ప్రొడక్షన్), ఏఈఈ (డ్రిల్లింగ్), ఏఈఈ (మెకానికల్), ఏఈఈ (ఎలక్ట్రికల్) పోస్టులకు వయోపరిమితి:

→ అన్ రిజర్వ్‌డ్ /ఈడబ్ల్యూఎస్ : 26 ఏళ్లు

→ ఓబీసీ: 29 ఏళ్లు

→ ఎస్సీ/ ఎస్టీ: 31 ఏళ్లు

జియాలజిస్ట్, జియోఫిజిక్స్ (సర్ఫేస్), జియోఫిజిక్స్ (వేల్స్) లకు వయోపరిమితి:

→ అన్ రిజర్వ్ డ్ /ఈడబ్ల్యూఎస్ : 27 ఏళ్లు

→ ఓబీసీ: 30 ఏళ్లు

→ఎస్సీ/ ఎస్టీ: 32 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ:

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టైప్) ద్వారా జనరల్ అవేర్నెస్, సంబంధిత సబ్జెక్టు, ఇంగ్లిష్ లాంగ్వేజ్, ఆప్టిట్యూడ్ టెస్ట్ మొత్తం 2 గంటల వ్యవధితో నిర్వహిస్తారు.

→ యాజమాన్యం నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం పర్సనల్ ఇంటర్వ్యూ తదుపరి ఎంపిక ప్రక్రియ కోసం అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేయడానికి సీబీటీ స్కోరును ఓఎన్జీసీ పరిగణనలోకి తీసుకుంటుంది.

→ ఆయా కేటగిరీల్లో 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్టింగ్ చేసేటప్పుడు ఎక్కువ మంది అభ్యర్థులు కనీస కటాఫ్ మార్కులు సాధిస్తే నిర్ణీత నిష్పత్తిలో సడలింపుతో వారందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు:

→ జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.1000.

→ ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

→ఆన్లైన్ విధానంలో చెల్లించాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఓఎన్జీసీ అధికారిక వెబ్సైట్‌ ongcindia.com ని విజట్ చేయండి.

Next Story