Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్, ఏడాదికి రూ.18లక్షల వరకు వేతనం

by Dishafeatures1 |
Bank Jobs:  బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్, ఏడాదికి రూ.18లక్షల వరకు వేతనం
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడాలో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 79

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 26

*ఇందులో అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో నాలుగేళ్ల డిగ్రీతో పాటు పీజీ/డిప్లొమా పాసై ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో మూడేళ్లు ఎక్స్ పీరియన్స్ చూస్తారు.

*అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు పీజీ/డిప్లొమా (మేనేజ్‌మెంట్‌)/సీఏ పాసై ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం 5 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15 నుంచి 18 లక్షలు వేతనంగా చెల్లిస్తారు.

*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.bankofbaroda.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.




Next Story

Most Viewed