ఇంటర్, డిప్లొమా అర్హతతో విజయవాడలో మెడికల్ ఉద్యోగాలు

by Gugulothu.Kavitha |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా, విజయవాడలోనిMedical jobs in Vijayawada

ఇంటర్, డిప్లొమా అర్హతతో విజయవాడలో మెడికల్ ఉద్యోగాలు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా, విజయవాడలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల(GGH)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 17

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 31

*ఇందులో ల్యాబ్ టెక్నీషయన్, డార్క్ రూం అసిస్టెంట్, ఈసీజీ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, సిటీ టెక్నీషియన్ పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని బట్టి ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ పాసై ఉండాలి.

*అలాగే సంబంధిత కోర్సుల సర్టిఫికేట్స్ తో పాటు ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం రాతపరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎక్స్ పీరియన్స్ చూస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12000 నుంచి రూ.61960 వేతనం చెల్లిస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తును Superintendent, GGH, Vijayawada, Krishna District, AP చిరునామాకి పంపించాలి.

Next Story