ఆంధ్రప్రదేశ్ లోని ఆ జిల్లాలో మెడికల్ ఉద్యోగాలు, నెలకు రూ.లక్షకు పైనే వేతనం

by Gugulothu.Kavitha |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం(DMHO)లోMedical jobs in Kadapa district

ఆంధ్రప్రదేశ్ లోని ఆ జిల్లాలో మెడికల్ ఉద్యోగాలు, నెలకు రూ.లక్షకు పైనే వేతనం
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం(DMHO)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్త ఉద్యోగ ఖాళీల సంఖ్య: 52

*ఇంటర్వ్యూ తేదీలు: 2022 మార్చి 26 నుంచి 31 వరకు

*ఇందులో మెడికల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అబ్ స్ట్రటిక్స్ అండ్ గైనకాలజీ, జీరియాట్రిక్, ఈఎన్ టీ, పీడియాట్రిక్స్, స్కిన్, ఆర్థోపెడిక్స్, చెస్ట్, ఎన్ సీడీ, జనరల్ సర్జరీ పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఎంబీబీఎస్ తో పాటు సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ డిగ్రీ పాసై ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 42 ఏళ్ల వయస్సుకు మించరాదు.

*ఉద్యోగ ఎంపిక కోసం అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, ఎక్స్ పీరియన్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూస్తారు. అలాగే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,10,000 వేతనం చెల్లిస్తారు.

*ఇంటర్వ్యూ వేదిక: DMHO, YSR Kadapa District, AP

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://kadapa.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story