తెలంగాణలోని ఆ జిల్లా కమిషనరేట్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు, త్వరపడండి

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు మంచి అవకాశం. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కమిషనరేట్ భరోసా సోసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కాంట్రాక్ట్ విధానంలోJobs in Khammam District Commissionerate

తెలంగాణలోని ఆ జిల్లా కమిషనరేట్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు, త్వరపడండి
X

నిరుద్యోగులకు మంచి అవకాశం. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కమిషనరేట్ భరోసా సోసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*డీ-బిజినెస్ సొల్యూషన్స్ ఏజెన్సీ ద్వారా ఉద్యోగ నియామక ప్రక్రియ జరుగుతుంది.

*ఇక్కడ డిగ్రీ పాస్ తో పాటు టాలీ, ఎంఎస్ ఆఫీస్ నైపుణ్యం ఉండాలి.

*కనీసం రెండేళ్లు ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15000 వేతనం చెల్లిస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తును Commissionerate Office, Khammam District, Telangana చిరునామాకి పంపించాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://bharosahydpolice.telangana.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story