IFFCO న్యూఢిల్లీలో ఉద్యోగాలు.. నెలకు రూ.37వేల వరకు వేతనం

by Dishafeatures1 |
IFFCO న్యూఢిల్లీలో ఉద్యోగాలు.. నెలకు రూ.37వేల వరకు వేతనం
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. న్యూఢిల్లీలోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్(IFFCO)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*ఇందులో అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ(ఏజీటీ) పోస్టులు ఉన్నాయి.

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 15

*విద్యార్హతకు సంబంధించి బీఎస్సీ(అగ్రికల్చర్) ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ పాసై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

*2019 తర్వాత బీఎస్సీ(అగ్రికల్చర్‌) ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

*వయోపరిమితికి సంబంధించి 2022 ఫిబ్రవరి 1 నాటికి 30 ఏళ్లు మించరాదు.

*ట్రైనింగ్ టైంలో నెలకు రూ. 33,300 స్టైఫండ్ అందజేస్తారు.

*శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు రూ.37000 వేతనం చెల్లిస్తారు.

*ఉద్యోగ ఎంపిక కోసం కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ,ఫైనల్‌ టెస్ట్‌),పర్సనల్‌ ఇంటర్వ్యూ,మెడికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు


Next Story

Most Viewed