Jobs: నిరుద్యోగులకు సువర్ణవకాశం.. నేడే ఆఖరి తేదీ

by Yella Dhawani Reddy |

భారతీయ రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Jobs: నిరుద్యోగులకు సువర్ణవకాశం.. నేడే ఆఖరి తేదీ
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయ రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 గ్రూప్‌-D ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు లెవల్-1 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది.

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్.

పోస్టుల ఖాళీలు: 32,438

పాయింట్స్‌మన్‌- 5,058

అసిస్టెంట్‌ (ట్రాక్‌ మెషిన్‌)- 799

అసిస్టెంట్‌ (బ్రిడ్జ్‌)- 301

ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4 - 13,187

అసిస్టెంట్‌ పీ-వే- 247

అసిస్టెంట్‌ (సీ అండ్‌ డబ్ల్యూ)- 2587

అసిస్టెంట్‌ లోకో షెడ్‌ (డిజిల్‌)- 420

అసిస్టెంట్‌ (వర్క్‌షాప్‌)- 3077

అసిస్టెంట్‌ (ఎస్‌ అండ్‌ టీ)- 2012

అసిస్టెంట్‌ టీఆర్‌డీ- 1381

అసిస్టెంట్‌ లోకో షెడ్‌ (ఎలక్ట్రికల్‌)- 950

అసిస్టెంట్‌ ఆపరేషన్స్‌- (ఎలక్ట్రికల్‌)- 744

అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్‌ ఏసీ- 1041

అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్ ఏసీ (వర్క్‌షాప్‌)- 625

అర్హత: టెన్త్ లేదా ఐటీఐ డిప్లొమా, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఓకేషనల్‌ ట్రైనింగ్‌ (NCVT) జారీ చేసిన నేషనల్‌ అప్రెంటిషిప్‌ సర్టిఫికెట్‌ (NAC), సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: జూలై 1వ తేదీ 2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్‌ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

ప్రారంభ వేతనం: నెలకు రూ.18,000.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 1వ తేదీ ౨౦౨౫

వెబ్ సైట్: https://indianrailways.gov.in/

Next Story