రాష్ట్రపతి పాలనను గరిష్టంగా ఎంత కాలం పొడగించవచ్చు..??

by Dishafeatures1 |
రాష్ట్రపతి పాలనను గరిష్టంగా ఎంత కాలం పొడగించవచ్చు..??
X

అత్యవసర పరిస్థితికి సంబంధించిన ముఖ్యమైన బిట్స్:

*రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి గురించి తెలిపే ఆర్టికల్స్: 352, 356, 360

*రాజ్యాంగంలో 18వ విభాగంలో అత్యవసర పరిస్థితికి సంబంధించిన అంశాలను పొందపరిచారు.

*జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలిపే ఆర్టికల్-352

*రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356 ప్రకారం విధిస్తారు.

*ఆర్థిక అత్యవసర పరిస్థితిని గురించి తెలిపే ఆర్టికల్- ఆర్టికల్ 360

*ఆంధ్రప్రదేశ్ లో జైఆంధ్ర ఉద్యమం కారణంగా 1973లో రాష్ట్రపతి పాలన విధించారు.

*మొదటి సారిగా పంజాబ్ లో రాష్ట్రపతి పాలన విధించారు.

*రాష్ట్రపతి పదవి చేపట్టడం వల్ల ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన వ్యక్తి గోపిచంద్ భార్గవ

*ఇంతవరకు దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధంచలేదు.

*కేంద్ర కేబినేట్ సలహా పై రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు.

*జాతీయ అత్యవసర పరిస్థితిని మొదట 6 నెలల కాలం విధించవచ్చు.

*ఆరు నెలలకు ఒకసారి చొప్పున పార్లమెంట్ ఆమోదంతో అత్యవసర పరిస్థితిని గరిష్ట కాలం ఎంత వరకైనా పొడగించవచ్చు.

*రాష్ట్రపతి ప్రకటించిన జాతీయ అత్యవసర పరిస్థితిని పార్లమెంట్ 30 రోజుల లోపు ఆమోదించాలి.

*మినర్వామిల్స్ కేసులో సుప్రీంకోర్టు జాతీయ అత్యవసర పరిస్థితిని న్యాయస్థానాల్లో ప్రశ్నించవచ్చని తీర్పు ఇచ్చింది.

*44వ సవరణ చట్టం జాతీయ అత్యవసర పరిస్థితిని న్యాయ సమీక్ష పరిధిలో చేర్చింది.

*1975 అత్యవసర పరిస్థితి ఫైల్ పై సంతకం చేసిన రాష్ట్రపతి- ఫక్రుద్దీన్ అలీ అహ్మద్

*1975 ఎమర్జెన్సీ ని జూన్ 26న విధించారు.

*అంతర్గత కల్లోలాలు కారణంగా 1975 జ ాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.

*1975 విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి 1977 మార్చిలో రద్దయ్యింది.

*రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన గరిష్టంగా 3 సంవత్సరాల పాటు పొడగించవచ్చు.

*1975లో విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి విచారించడానికి నియమించన కమిషన్ షా కమిషన్

*దేశంలో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలనను ఇందిరాగాంధీ కాలంలో విధించబడింది.

*రాష్ట్రపతి పాలనను పార్లమెంట్ 2 నెలల కాలంలోపు ఆమోదించాలి.

*రాష్ట్రపతి పాలన విధించడానికి బొమ్మై కేసులో మార్గదర్శకాలను పేర్కొంది.


Next Story

Most Viewed