ఐసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ తేదీలు ఖరారు!

by Geesa Chandu |
ఐసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ తేదీలు ఖరారు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఐసెట్ ఫస్ట్‌ ఫేజ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ను.. టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన ఆదివారం ప్రకటించారు. ఈనెల 8వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ కు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. కాగా తొలిరోజు ఆదివారం 3057 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నట్లు తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకు కొనసాగుతుందని ఆమె వెల్లడించారు. ఇంకా ఇతర వివరాలకు https://tgicet.nic.in వెబ్ సైట్ సందర్శించాలని ఆమె సూచించారు.

Advertisement

Next Story

Most Viewed