- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈసారి గ్రూప్-4లో భారీగా ఉద్యోగాలు, ఇవి చదివితే ఉద్యోగం మీదే..
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ వేదికగా 80వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదలGroup-4 Syllabus, Exam Pattern

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ వేదికగా 80వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో 10శాతానికి పైగా ఉద్యోగాలు గ్రూప్ 4 ఉద్యోగానికి సంబంధించినవే.
*మొత్తం 80వేల ఉద్యోగాల్లో 9168 గ్రూప్ 4 ఉద్యోగాలున్నాయి. అయితే ఏకాగ్రత సాధించి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెడితే ఉద్యోగం అభ్యర్థి సొంతమవుతోంది.
*గ్రూప్-4 సిలబస్:
పేపర్1:
*కరెంట్ అఫైర్స్.
*అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు.
*ప జనరల్ సైన్స్.
*పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ.
*భారతదేశ, తెలంగాణ భౌగోళిక, ఆర్థిక వ్యవస్థ.
*భారత రాజ్యాంగం : ముఖ్యమైన లక్షణాలు.
*భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం.
*భారత జాతీయ ఉద్యమంపై దృష్టి సారించి ఆధునిక భారత చరిత్ర.
*తెలంగాణ, తెలంగాణ ఉద్యమ చరిత్ర.
*తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం.
*తెలంగాణ రాష్ట్ర విధానాలు.
పేపర్2:
*వెర్బల్ మరియు నాన్ వెర్బల్
*లాజికల్ రీజనింగ్.
*కాంప్రహెన్షన్.
* ఒక ప్యాసేజీ యొక్క విశ్లేషణను మెరుగుపరచే ఉద్దేశ్యంతో వాక్యాలను తిరిగి అమర్చడం.
*సంఖ్యాగణిత సామర్థ్యాలు
*గ్రూప్ 4 ఎగ్జామ్ లో వర్తమాన అంశాలపై ఫోకస్ చేస్తే మంచి స్కోర్ సాధించవచ్చు.
*పాలిటీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి.
*తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల గురించి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
*అలాగే అర్థమెటిక్, రీజినింగ్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ చేయవచ్చు.






