భారత రాజ్యాంగ చరిత్ర

by Disha Web Desk 21 |
భారత రాజ్యాంగ చరిత్ర
X

దిశ, ఎడ్యుకేషన్: యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్ పీఎస్సీ, ఎస్ ఎస్సీ.. వంటి అన్ని పోటీపరీక్షలకు ఉపయోగకరమైన జనరల్ స్టడీస్ ను టార్గెట్ పేజీలో దిశ అందిస్తోంది. అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉండేందుకు ముందుగా ఇండియన్ పాలిటీ మీకోసం..

ఒక దేశంలోని ప్రజలు, ప్రభుత్వం, పాలనా యంత్రాంగం, వ్యక్తులు, సంస్థలతో పాటు అందరూ పాటించే అత్యున్నత నియమావళి భారత రాజ్యాంగం..

భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26న ఆమోదించింది.

భారత రాజ్యాంగ ప్రారంభంలో 22 భాగాలు, 395 ఆర్టికల్స్ 8 షెడ్యూల్స్ ఉన్నాయి.

ప్రస్తుతం రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్, 22 భాగాలు ఉన్నాయి.

రాజ్యాంగ రూపకల్పన:

భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ రూపొందించింది.

దీనిని కేబినెట్ మిషన్ ప్లాన్ - 1946 కింద ఏర్పాటు చేశారు.

రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.

రాజ్యాంగ పరిషత్ మొత్తం 165 రోజులలో 11 సమావేశాలను నిర్వహించింది.

దీనిలో ముసాయిదా రాజ్యాంగం పరిశీలన, చర్చ కోసం 114 రోజులు సమయం వెచ్చించారు.

క్యాబినెట్ మిషన్ సిఫారసును అనుసరించి రాష్ర్ట శాసన సభల సభ్యులు పరోక్ష ఎన్నికల ద్వారా రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకున్నారు.

రాజ్యాంగ పరిషత్ కు మొత్తం 389 సభ్యులను ఎన్నుకున్నారు.

దేశ విభజన అంశం కారణంగా పాకిస్థాన్ కోసం పత్యేక రాజ్యాంగ సభ ఏర్పాటు చేశారు.

దీంతో రాజ్యాంగ సభ అసెంబ్లీలో సబ్యుల సంఖ్య 299కి తగ్గింది.

కేబినెట్ మిషన్ ప్లాన్ - 1946:

రెండో ప్రపంచ యుద్దం మే 9, 1945తో ముగిసింది.

భారతదేశానికి స్వాతంత్ర్యం అంశం పరిష్కారం కోసం ముగ్గురు బ్రిటీష్ క్యాబినెట్ మంత్రులను భారతదేశానికి పంపారు.

ఈ మిషన్ లో సభ్యలు.. లార్డ్ పెథిక్ లారెన్స్, స్టాఫోర్డ్ క్రిప్స్, ఎవి అలెగ్జాండర్.

ఈ మిషన్ నే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని పిలుస్తారు.

కేబినెట్ మిషన్ రాజ్యాంగ నిర్మాణం గురించి చర్చించింది.

అలాగే రాజ్యాంగ ముసాయిదా కమిటీ అనుసరించాల్సిన విధానాన్ని వివరంగా పేర్కొంది.

అసెంబ్లీని డిసెంబర్ 9, 1946న ప్రారంభించింది.

తొలి తాత్కాలిక జాతీయ ప్రభుత్వం:

1946 పెప్టెంబర్ 2న ప్రభుత్వం ఏర్పడింది.

దీనికి పండిట్ నెహ్రూ నాయకత్వం వహించారు.

తాత్కాలిక ప్రభుత్వ సభ్యులందరూ వైస్రాయ్..కార్యనిర్వాహక మండలి సభ్యులుగా ఉన్నారు.

వైస్రాయ్ రాజ్యాంగ పరిషత్ అధిపతిగా కొనసాగారు.

ముసాయిదా కమిటీ ఉపాధ్యక్షుడిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నియమితులయ్యారు.

రాజ్యాంగ పరిషత్:

ప్రజలు ప్రాంతీయ అసెంబ్లీల సభ్యులను ఎన్నుకున్నారు.

అసెంబ్లీల సభ్యులు రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకున్నారు.

ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి ఫ్రాంక్ ఆంటోని ప్రాతినిధ్యం వహించాడు.

డాక్టర్ సచ్చిదానంద సిన్హా పరిషత్ తొలి సమావేశానికి రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా ఉన్నారు.

డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ముసాయిదా కమిటీ ఛైర్మన్ గా బి.ఆర్ అంబేద్కర్ నియమితులయ్యారు.

భారత రాజ్యాంగ మూలాలు:

భారత రాజ్యాంగం ప్రంపంచంలోని దాదాపు అన్ని దేశాల నుండి తీసుకోబడింది.

రాజ్యాంగం కొన్ని ప్రత్యే క లక్షణాలు కూడా కలిగి ఉంది.

భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి గ్రహించిన అంశాలు:

సమాఖ్య వ్యవస్థ, గవర్నర్ కర్యాలయం, న్యాయవ్యవస్థ, పబ్లిక్ సర్వీస్ కమిషన్, అత్యవసర నిబంధనలు, పరిపాలనా వివరాలు.

బ్రిటీష్ రాజ్యాంగం: పార్లమెంటరీ వ్యవస్థ, చట్ట పాలన, శాసన విధానం, ఒకే పౌరసత్వం, కేబినెట్ వ్యవస్థ, ప్రత్యేక హక్కు రిట్లు, పార్లమెంటరీ హక్కులు, ద్విసభా విధానం

అమెరికా రాజ్యాంగం: ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయవ్యవస్థ, న్యాయ సమీక్ష, రాష్ర్టపతి అభిశంసన, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, ఉపరాష్ట్రపతి పదవి.

ఐరిష్ రాజ్యాంగం: రాష్ర్ట ఆదేశిక సూత్రాలు, రాజ్యసభ సభ్యుల నామినేషన్, రాష్ర్టపతి ఎన్నికల విధానం.

కెనడియన్ రాజ్యాంగం: బలమైన కేంద్రం కలిగిన సమాఖ్య, కేంద్రం వద్ద అవిశిష్ఠ అధికారాలు, కేంద్ర..సుప్రీంకోర్టు సలహా అధికార పరిధిచే గవర్నర్ నియామకం.

ఆస్ట్రేలియన్ రాజ్యాంగం: కేంద్ర జాబితా, పార్లమెంటు..రెండు సభల ఉమ్మడి సమావేశం, వాణిజ్య స్వేచ్ఛ.

జర్మనీ రాజ్యాంగం: అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కులను నిలిపివేయడం.

ఫ్రెంచ్ రాజ్యాంగం : రాజ్యాంగ పీఠిక గణతంత్రం..స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఆదర్శాలు.

దక్షిణాఫ్రికా రాజ్యాంగం: రాజ్యాంగ సవరణ, రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించిన విధానం.

జపనీస్ రాజ్యాంగం: చట్టం ద్వారా ఏర్పాటు చేసిన విధానం.

యూఎస్ఎస్ఆర్ రాజ్యాంగం: ప్రాథమిక విధులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ.. న్యాయ ఆదర్శాలు.


Next Story

Most Viewed