- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను మే 18న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్-2025 పరీక్షా ఫలితాలు రేపు అనగా సోమవారం విడుదల కానున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో బీటెక్ (B.Tech), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BA) ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను మే 18న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్-2025 (JEE Advanced-2025) పరీక్షా ఫలితాలు రేపు అనగా సోమవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు పరీక్షా బాధ్యతలు నిర్వహించిన ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) సరిగ్గా ఉదయం 10 గంటలకు ర్యాంకులను ప్రకటించనుంది. దేశ వ్యాప్తంగా మొత్తం 1.80 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యారు. గతేడాది అడ్వాన్స్‌డ్‌లో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్ మార్కుల ఆధారంగా మొత్తం 48,248 మందికి జోసా కౌన్సెలింగ్ (Xhosa Counseling)లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. కానీ, వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులు. అదేవిధంగా 2024-25 విద్యా సంవత్సరానికి గాను 23 ఐఐటీల్లో 17,760 సీట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. జూన్ 3 సాయంత్రం 5 గంటల నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం ఆరు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లుగా ఐఐటీ కాన్పుర్ ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేసింది.






