BEL:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బెల్‌లో ఉద్యోగాలు

by Yella Dhawani Reddy |

ప్రభుత్వ రక్షణ రంగ స్థంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

BEL:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బెల్‌లో ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రక్షణ రంగ స్థంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు:

సీనియర్ అసిస్టెంట్ : 10 బెంగళూరు

ట్రైనీ ఇంజినీర్‌-1: 42 పంచకుల

ప్రాజెక్టు ఇంజినీర్‌-1: 03 పంచకుల

అర్హత:

సీనియర్ అసిస్టెంట్‌లో పోస్టుకు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే వయసు: 1-02-2025 నాటికి 50 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌ (మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వేతనం: పోస్టును అనుసరించి రూ.30,000 - రూ.1,20,000 వరకు ఉంటుంది

ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా సీనియర్ అసిస్టెంట్ ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష, మెరిట్‌ ఆధారంగా ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చివరి తేదీ:

మార్చి 12

ట్రైనీ ఇంజినీర్‌-1

ప్రాజెక్టు ఇంజినీర్‌-1

మార్చి 19

సీనియర్ అసిస్టెంట్

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bel-india.in/job-notifications/‌ ను సందర్శించండి.

Next Story