సశస్త్ర సీమాబల్‌లో 40 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు

by Disha Web Desk 7 |
సశస్త్ర సీమాబల్‌లో 40 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు
X

దిశ, కెరీర్: న్యూఢిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్‌బీ).. ఏఎస్ఐ (స్టెనో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన వారు దేశ వ్యాప్తంగా ఎస్ఎస్‌బీ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ స్టెనోగ్రాఫర్ (గ్రూప్ సి నాన్ గెజిటెడ్ ) - 40 పోస్టులు

అర్హత: ఇంటర్‌తోపాటు టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్లు.

వేతనం: నెలకు రూ. 29,200 నుంచి 92,300 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, టైపింగ్ /స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ .. ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

వెబ్‌సైట్: http://www.ssbrectt.gov.in/


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed