టెన్త్, ఇంటర్, ఐటీఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ. లక్ష40వేల వరకు వేతనం

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందినAssistant Jobs in SCTIMST

టెన్త్, ఇంటర్, ఐటీఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ. లక్ష40వేల వరకు వేతనం
X

నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (SCTIMST)పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 30

*ఇందులో సైకాలజీ, ఫార్మసిస్ట్‌, అసిస్టెంట్‌ డైటీషియన్‌, టెక్నికల్ అసిస్టెంట్‌, ఫిజియోథెరపిస్ట్‌, ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, కుక్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్ క్లాస్, ఐటీఐ, ఇంటర్మీడియట్‌ (10+2), ఎంఎల్‌టీ, డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, బీఎస్సీ, ఎంఏ/తత్సమాన, బీఫార్మసీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎమ్మోస్సీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ పాసై ఉండాలి.

*సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ తో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 2022 ఫిబ్రవరి 1 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,000ల నుంచి రూ.1,42,400ల వరకు వేతనంగా చెల్లిస్తారు.

*దరఖాస్తు ఫీజు: రూ. 500. ఎస్సీ, ఎస్టీ, మహిళ, పీహెచ్ సీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.sctimst.ac.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story