నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 3603 ఉద్యోగాలు

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలతో పాటు హవల్దార్ విభాగాల్లో3603 jobs in Staff Selection Commission

నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 3603 ఉద్యోగాలు
X

నిరుద్యోగులకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలతో పాటు హవల్దార్ విభాగాల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3603

*దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 30

*టైర్1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జూలైలో ఉంటుంది.

*టైర్2 డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ తేది వెల్లడించాల్సి ఉంది.

*మల్టీ టాస్కింగ్ స్టాప్ విభాగానికి సంబంధించి ఉద్యోగ ఖాళీ వివరాలను వెల్లడించలేదు.

*హవల్దార్ విభాగంలో 3603 ఉద్యోగాలున్నాయి.

*విద్యార్హతకు సంబంధించి గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి టెన్త్ క్లాస్ పాసై ఉంటే సరిపోతుంది.

*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://ssc.nic.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story