యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 28 ఉద్యోగాలు

by Gugulothu.Kavitha |   (  Updated:2022-03-28 03:43:51  IST  )

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో jobs in the Union Public Service Commission

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 28 ఉద్యోగాలు
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 28

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 14

*ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ డైరెక్టర్‌ 8, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ 15, లెక్చరర్‌ 2, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ 3 పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

*డిప్యూటీ డైరెక్టర్ ఉద్యోగానికి సంబంధించి మైన్స్ సెఫ్టీ విభాగంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పాసై ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో 10 ఏళ్ల పాటు ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగానికి సంబంధించి ఎకానమిక్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత విభాగం 2 సంవత్సరాలు ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*లెక్చరర్‌ ఉద్యోగాలకు సంబంధించి ఆప్థమాలజీ విభాగంలో ఎంఎస్/ఎండీలో పాసై ఉండాలి. అలాగే కనీసం 3 సంవత్సరాలు ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగానికి సంబంధించి సివిల్ విభాగంలో ఇంజనీరింగ్ పాసై ఉంటే సరిపోతుంది. అలాగే కనీసం 2 సంవత్సరాలు ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి ఉద్యోగాన్ని అనుసరించి 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://upsconline.nic.in/ora/VacancyNoticePub.php వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story