- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుల బాధ తాళలేక కారు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..
<p>దిశ, జవహర్ నగర్: అప్పుల బాధ తట్టుకోలేక ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కారు తలుపులు లాక్ వేసుకుని ఓ కారు డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ కు చెందిన కె సాయిబాబా (40) కారు డ్రైవర్ గా పని చేస్తూ భార్యతో కలిసి జీవిస్తున్నాడు. గత కొంత కాలంగా పని లేకపోయేసరికి కొందరి వద్ద అప్పు చేశాడు. ఆ అప్పులను […]</p>

దిశ, జవహర్ నగర్: అప్పుల బాధ తట్టుకోలేక ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కారు తలుపులు లాక్ వేసుకుని ఓ కారు డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ కు చెందిన కె సాయిబాబా (40) కారు డ్రైవర్ గా పని చేస్తూ భార్యతో కలిసి జీవిస్తున్నాడు.
గత కొంత కాలంగా పని లేకపోయేసరికి కొందరి వద్ద అప్పు చేశాడు. ఆ అప్పులను తీర్చడానికి డబ్బులేక, అప్పుల భాధలు తట్టుకోలేక, విషం తాగి ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. తన భార్యను పిలిచి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం ఇచ్చి, తన కారులో కూర్చొని తాళం వేసుకొన్నాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న విషం తాగాడు. దీంతో డ్రైవర్ భార్య పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు తలుపులు అన్‌లాక్ చేసి సాయిబాబాను రక్షించి దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.






