కారు, బైక్ ఢీ : నలుగురికి తీవ్రగాయాలు 

by  |
కారు, బైక్ ఢీ : నలుగురికి తీవ్రగాయాలు 
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా రాజంపేట మండలంలో స్నాపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు బైకును ఢీకొన్న ఘటనలో బైక్ పై రాజంపేటకు వస్తున్న ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కాగా.. కారులో కడపకు వెళుతున్న మరో ఇద్దరికు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. రాజంపేటలో ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed